బుధవారం 03 జూన్ 2020
Cinema - May 07, 2020 , 23:28:11

వైన్‌ కాదు.. సిరప్‌!

వైన్‌ కాదు.. సిరప్‌!

నిజానిజాల నిర్ధారణ లేకుండా సోషల్‌మీడియాలో వ్యాప్తి చెందే వార్తల వల్ల సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా కథానాయికల్ని లక్ష్యంగా చేసుకొని ఈ ఫేక్‌న్యూస్‌ను ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్‌పై సోషల్‌మీడియాలో ఓ ఫేక్‌ వీడియో సర్క్యులేట్‌ అవుతోంది. ముంబయిలోని ఓ షాపు వద్ద రకుల్‌ప్రీత్‌సింగ్‌ మద్యం కొనుగోలు చేసి వెళ్తుందంటూ ఓ వీడియో గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో  చక్కర్లు కొడుతోంది. చేతిలో ఒక బాటిల్‌ పట్టుకొని రకుల్‌ప్రీత్‌సింగ్‌ నడిచి వెళుతున్న ఫొటోను చూసి చాలా మంది ఆమె మద్యం కొనుగోలు చేసిందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ ముంబయి బాంద్రా ప్రాంతంలోని ఓ మెడికల్‌ స్టోర్‌లో సిరప్‌ తీసుకొని బయటకు వస్తుండగా ఆ వీడియోను తీశారని తెలిసింది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా తెలిపారు. దీంతో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై దుష్ప్రచారం చేసిన కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవమేమిటో రూఢీ చేసుకున్న తర్వాతే వీడియోల్ని షేర్‌ చేయాలని సూచిస్తున్నారు. 


logo