గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 13, 2020 , 11:51:27

హీరో విజ‌య్‌పై మ‌రోసారి ఐటీ రైడ్‌..!

హీరో విజ‌య్‌పై మ‌రోసారి  ఐటీ రైడ్‌..!

తమిళ నాట దళపతి విజయ్‌పై ఐటీ రైడ్స్ రోజుకో రూపు సంతరించుకుంటుంది. బిగిల్ చిత్ర విషయం చూపిన లెక్కలు తప్పుగా ఉండటంతో ఈ రైడ్స్ జరిగాయ‌ని అప్ప‌ట్లో అధికారులు చెప్పారు. బిగిల్ చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్షియర్స్, హీరోపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఈ తనిఖీల్లో లెక్కల్లోకి రాని దాదాపు రూ. 77కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.  అయితే  కొద్దిరోజుల క్రితం విజ‌య్ ఇంటిపై, అతడికి సంబంధించిన ఆఫీస్ ల పై దాడులు చేసిన ఆదాయ‌పు ప‌న్ను అధికారులు మ‌రోసారి రైడ్ చేశార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

గురువారం   విజ‌య్ ఇంటిపై  ఐటీ అధికారులు రైడ్ చేసిన విష‌యంపై ప‌లు పుకార్లు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికారులు వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా మేము జ‌రిపేది రైడ్ కాదు. గ‌త నెల‌లో మేము కొన్ని గదులు, డ్రాలు ,  లాకర్లను మూసివేసాము. ఆ సీల్‌ని తొల‌గించేందుకే విజ‌య్ ఇంటికి వెళ్ళాం అని ఓ ఐటీ అధికారి చెప్పారు. మాస్ట‌ర్ సెట్‌కి వెళ్లి విజ‌య్‌ని విచారించ‌డంతో పాటు మాస్టర్ సినిమాకు సహ నిర్మాతగా పనిచేస్తున్న లలిత్ కుమార్ ఇల్లు, కార్యాలయాల్లో సైతం ఐటీ సోదాలు జరుగుతుండ‌డం బ‌ట్టి చూస్తే దీని వెనుక రాజ‌కీయ దురుద్దేశం ఏమైన ఉందా అని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు .


logo