మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jun 17, 2020 , 19:26:39

సుశాంత్‌ మరణం కలిచివేసింది

సుశాంత్‌ మరణం కలిచివేసింది

జెరూసలెం: బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణం ఇజ్రాయెల్‌ వాసులను ముఖ్యంగా నన్ను ఎంతగానో కలిచివేసిందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ గిలాడ్‌ కోహెన్‌ అన్నారు. సుశాంత్‌ మృతి పట్ల ఆయన ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించారు. ఇజ్రాయెల్‌ దేశానికి నిజమైన స్నేహితుడు సుశాంత్‌ను కోల్పోవడం బాధాకరంగా ఉన్నది అని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్‌ను తమ దేశం ఎంతో మిస్‌ అవుతోంది అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన సినిమాలోని పాటను షేర్‌ చేశారు. సుశాంత్‌ నటించిన మఖ్నా సినిమా చాలా వరకు ఇజ్రాయెల్‌లో చిత్రీకరించారు. logo