మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 16, 2020 , 07:02:13

సోనీ మ్యాక్స్‌లో ఇస్మార్ట్ శంక‌ర్ హిందీ డ‌బ్బింగ్ చిత్రం

సోనీ మ్యాక్స్‌లో ఇస్మార్ట్ శంక‌ర్ హిందీ డ‌బ్బింగ్ చిత్రం

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.. నిధి అగర్వాల్, నభా నటేష్ హియర్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా ఊహించిన దానికంటే భారీ హిట్టును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్ర హిందీ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ సోనీ మ్యాక్స్‌లో ఆదివారం రాత్రి 8గం.ల‌కి ప్ర‌సారం కానుంది. ఈ విష‌యాన్ని రామ్ కూడా వీడియో ద్వారా తెలియ‌జేశారు. గ‌తంలో ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంద‌ని ప‌లు  వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకున్నట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌గా,  హీరోగా రణ్‌వీర్‌ సింగ్‌ నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా చేస్తున్న పూరీ జ‌గ‌న్నాథ్ త్వ‌ర‌లో  ఇస్మార్ట్ శంకర్ సినిమాకి  సీక్వెల్  కూడా చేయ‌నున్నాడు. 


logo