శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 14:35:47

రీమేక్‌పైనే ఆశ‌లు పెట్టుకున్న‌ ఇస్మార్ట్ భామ‌

రీమేక్‌పైనే ఆశ‌లు పెట్టుకున్న‌ ఇస్మార్ట్ భామ‌

న‌భాన‌టేశ్‌..ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో తెలంగాణ యాస‌లో న‌భాన‌టేశ్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ త‌ర్వాత న‌భాకు ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చాయి. ర‌వితేజ‌తో క‌లిసి న‌టించిన డిస్కో రాజా ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. ఆ త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తో న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ కూడా న‌భాన‌టేశ్‌కు తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి.

ఈ భామ‌ ప్ర‌స్తుతం నితిన్ తో క‌లిసి అంధాధున్ తెలుగు రీమేక్ లో న‌టిస్తోంది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత వ‌చ్చిన మూడు సినిమాలు త‌న‌కు క‌లిసి రాక‌పోవ‌డంతో ఇపుడు ఆశ‌ల‌న్నీ ఈ రీమేక్ పైనే పెట్టుకుంది న‌భా. ఈ చిత్రంతో ఎలాగైన హిట్టు కొట్టి మ‌ళ్లీ ఫాంలోకి రావాల‌ని ఎదురుచూస్తోంది న‌భాన‌టేశ్‌. నితిన్ సినిమాతోనైనా త‌న‌కు మ‌ళ్లీ అదృష్టం క‌లిసొస్తుంద‌ని ఎదురుచూస్తున్న న‌భాకు ఓ మంచి హిట్టు ప‌డాల‌ని విష్ చేస్తున్నారు ఆమె ఫాలోవ‌ర్లు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

రజినీకాంత్ అనూహ్య నిర్ణయం..ఆందోళనలో ఫ్యాన్స్..!


సూర్య సినిమాకు అవమానం జ‌రిగిందా..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo