మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 18:26:41

చీర‌క‌ట్టులో మెరుస్తోన్న న‌భాన‌టేశ్‌..ఫొటోలు చ‌క్క‌ర్లు

చీర‌క‌ట్టులో మెరుస్తోన్న న‌భాన‌టేశ్‌..ఫొటోలు చ‌క్క‌ర్లు

న‌న్ను దోచుకుందువ‌టే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ భామ న‌భా న‌టేశ్‌. ఆ త‌ర్వాత అదుగో, ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రాల్లో న‌టించింది. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీలో తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెబుతూ.. మాస్ లుక్ లో క‌నిపిస్తూ అంద‌రినీ అల‌రించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో క‌నిపించి సంద‌డి చేస్తోంది. ఎప్పుడూ వెస్ట‌ర్న్ లుక్‌, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో క‌నిపించే ఈ  భామ ఇలా శారీలో క‌నిపించి అంద‌రినీ క‌ళ్లు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తోంది.

ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఏడాది సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, అల్లుడు అదుర్స్ చిత్రాల్లో న‌టిస్తోంది న‌భా న‌టేశ్‌. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo