మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 19:43:38

‘ఇష్క్ క‌మాల్’ పాట కాపీ చేశారు: శెజాన్ స‌లీమ్

‘ఇష్క్ క‌మాల్’ పాట కాపీ చేశారు: శెజాన్ స‌లీమ్

సంజ‌య్ ద‌త్, అలియాభ‌ట్, ఆదిత్యారాయ్ క‌పూర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం స‌డ‌క్-2. ఈ మూవీ ట్రైల‌ర్ కు ల‌క్ష‌ల్లో డిస్ లైక్స్ వ‌చ్చి..చిత్ర‌యూనిట్ ను నిరాశ‌కు లోను చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి మ‌రో స‌మ‌స్య వ‌చ్చింది. అలియాభ‌ట్‌, ఆదిత్యారాయ్ క‌పూర్ మ‌ధ్య ఇష్క్ క‌మాల్ అంటూ సునిల్‌జీత్ కంపోజిష‌న్ లో వ‌చ్చిన‌ పాట..త‌న పాట‌కు కాపీ అని ఫిల్మ్ మేక‌ర్‌, మ్యూజిక్ కంపోజ‌ర్ శెజాన్ స‌లీమ్ ఆరోపిస్తున్నాడు. 2011లో నేను పాకిస్థాన్ లో లాంఛ్ చేసిన ర‌బ్బా హో పాట‌ను కాపీ చేశారంటున్నాడు. దీనిపై సునిల్ జిత్ స్పందిస్తూ..ఇష్క్ క‌మాల్ సాంగ్ తాను స్వయంగా కంపోజ్ చేశాన‌ని, ఏ పాట‌కు కాపీ కాద‌ని అన్నాడు.

ప్రముఖ సింగ‌ర్ జావెద్ అలీతోపాటు చాలా మంది క‌ష్ట‌ప‌డి ఈ పాట‌ను సిద్దం చేశామ‌ని, త‌న మ్యూజిక్ కూడా దీనికి ప్ల‌స్ అయింద‌ని సునీల్ జిత్ అన్నాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఇది నాకు మొద‌టి పాట‌. సంగీత ప్రియులు, ప్ర‌జ‌ల‌కు ఈ పాట త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo