బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 14:57:30

క‌రోనా స‌మ‌యంలో త‌న ప్రియుడి క‌ష్టాలు వివ‌రించిన ఇషా

క‌రోనా స‌మ‌యంలో త‌న ప్రియుడి క‌ష్టాలు వివ‌రించిన ఇషా

ఇమ్రాన్ హష్మీ హీరోగా వచ్చిన ‘జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ఇషా గుప్తా. టాలీవుడ్ లో వ‌చ్చిన‌ విన‌య విధేయ రామ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న స్పెష‌ల్ సాంగ్ చేసిన ఇషా కొన్నాళ్లుగా స్పెయిన్ దేశానికి చెందిన మాన్యుయెల్ కాంపోస్ గుల్లార్ అనే వ్యక్తితో ప్రేమ‌లో ఉంది. ఇన్నాళ్ళు సీక్రెట్‌గా ఉంచిన ఈ విష‌యాన్ని క‌రోనా క‌ష్ట‌కాలంలో చెప్పింది.

తాజాగా ఇషా గుప్తా త‌న ఇన్‌స్టాగ్రాములో..  ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెబుతూ,  తన ప్రియుడు మాన్యుయేల్ గుల్లార్ స్పెయిన్‌లో చిక్కుకున్నాడ‌ని చెబుతూ అత‌నితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ 'ఐ లవ్ యూ సో మచ్. మై లవ్' అంటూ స్పానిష్ లో కామెంట్ పెట్టింది. ఇషా ఇలా తన ప్రియుడి గురించి అఫీషియల్ గా చెప్పడం ఇదే మొదటిసారి. ప్రతీరోజు చాలా సార్లు ఆయన తో వీడియో కాలింగ్ లో మాట్లాడుతున్నాను. ఆయన ఆరోగ్యం గురించే నాకు ఎక్కువ బెంగగా ఉంది. ఆయన ఐసోలేషన్ లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్న ఏదో తెలియని బాధ వెంటాడతున్నది' అని ఇషా గుప్తా చెప్పారు.  ఇషా గుప్తా ప్రస్తుతం బాలీవుడ్ లో 'దేశీ మ్యాజిక్' 'హేరా ఫేరీ 3' అనే చిత్రాలలో నటిస్తోంది.


logo