న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. స్పోర్ట్స్ బైకుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ ప్రారంభ ధర రూ.17.9 లక్షలుగా నిర్ణయించింది. 999 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకు కేవలం 3.2 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని, గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. మూడు రకాల్లో లభించనున్న ఈ బైకు స్టాండర్డ్ ధర రూ.17.90 లక్షలు, ప్రొ మోడల్ రూ.19.75 లక్షలు, ప్రో ఎం స్పోర్ట్ ధర రూ.22.5 లక్షలుగా నిర్ణయించింది.