గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 20:49:38

టాలీవుడ్‌లో స్టార్స్ పారితోషికాలు తగ్గించగలరా?

టాలీవుడ్‌లో స్టార్స్ పారితోషికాలు తగ్గించగలరా?

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల మధ్య వున్న పోటీతో స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల పారితోషికాలు చుక్కలనంటాయి...కాంబినేషన్ సెట్టింగ్ కోసం తహతహలాడుతూ సినిమా సినిమాకి స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల రెమ్యూనరేషన్స్ పెంచేశారు టాలీవుడ్ నిర్మాతలు. ఇటీవలే యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్.. వాళ్లు కరోనా కారణంగా హీరోలు, దర్శకులు తమ పారితోషికాల్లో ఇరవై శాతం కోత విధిస్తున్నామని ప్రకటించారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యమనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే బాబు.. బాబు అంటూ హీరోలు, దర్శకుల వెంట పడే మన నిర్మాతలు వారి రెమ్యూనరేషన్స్ తగ్గించే సాహసం చేస్తారా? అంటే సందేహమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మన నిర్మాతల మధ్య ఐక్యత లేకుండా.. స్టార్ హీరోలు, దర్శకుల పారితోషికాలు తగ్గిస్తే మరోసారి ఆ నిర్మాతకు హీరో డేట్స్ ఇవ్వడం కుదురుతుందా..?ఈ భయం నిర్మాతల్లో లేకుండా వుండాలంటే.. సదరు హీరోలు స్వచ్ఛందంగా పారితోషికం తగ్గించుకోవడానికి ముందుకు రావాలి. లేదంటే ఈ నియమం కేవలం చిన్న హీరోల వరకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది అనేది టాలీవుడ్‌లో కొంతమంది నిర్మాతల వాదన.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo