శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 19:11:14

సాయిధరమ్ తేజ్‌కు కరోనా?

సాయిధరమ్ తేజ్‌కు కరోనా?

టాలీవుడ్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల తమన్నా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా, తాజాగా  యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌కు కరోనా నిర్ధారణ జరిగిందని తెలిసింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన సాయి నటిస్తున్న తాజా చిత్రం సోలో బతుకే సో బెటర్ షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఈ సినిమా నెగెటివ్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను జీటీవీ, జీఫ్లెక్స్‌కు మంచి రేటుకే ఇచ్చారు. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని జీటీవీ, జీఫ్లెక్స్‌లో నేరుగా విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే సాయిధరమ్‌తేజ్ గత కొద్దిరోజులుగా అస్వస్థతగా వుండటంతో డబ్బింగ్ వర్క్ మిగిలిపోయిన కారణంగా విడుదల కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సాయి ధరమ్‌తేజ్ హోమ్ ఐసోలేషన్‌లో వున్నాడని, కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగిందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంద. ఇటీవల సాయి మేనమామ నాగేంద్రబాబు కూడా కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.