ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 11:56:12

డైలామాలో పూరీ జ‌గ‌న్నాథ్‌..?

డైలామాలో  పూరీ జ‌గ‌న్నాథ్‌..?

స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు త‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు, అభిప్రాయాలు (ఆడియో సందేశాలు) తెలియ‌జేస్తున్న విష‌యం తెలిసిందే. రోజుకొక అంశాన్ని తీసుకుని పూరీ చెప్పే మాట‌లు అంద‌రినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. అయితే లాక్ డౌన్ తో త‌న సినిమా షూటింగ్ నిలిపేసిన పూరీ జ‌గ‌న్నాథ్..కొంత కాలంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఫైట‌ర్ సినిమా చేస్తున్నాడు. పూరీ డైల‌మాలో ప‌డి త‌న సినిమాల గురించి కానీ, విడుద‌ల గురించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ‌లేక‌పోతున్నాడ‌ని టాలీవుడ్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

మ‌రి పూరీ జ‌గ‌న్నాథ్ తిరిగి ఎప్పుడు సెట్స్ లో జాయిన్ అవుతాడోన‌ని అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్నారు. పూరీ ఇప్ప‌టికైనా సినిమా అప్ డేట్ తో బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు ఫాలోవ‌ర్లు, అభిమానులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.