ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 14:56:06

ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు షురూ..!

ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు షురూ..!

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ లో ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ రానున్న సంగ‌తి తెలిసిందే. ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్దం చేసినప్ప‌టికీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో వ‌‌రుణ్ తేజ్‌, వెంక‌టేశ్ కూడా అందరు స్టార్ల‌లాగే బ్రేక్ తీసుకున్నారు. ఇద్ద‌రు స్టార్లు త‌మ ప్రాజెక్టుల‌ను ఇప్ప‌టికే సెట్స్ పైకి తీసుకెళ్లారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ష‌న్ లో వెంకీ నార‌ప్ప చిత్రం చేస్తుండ‌గా..సాయికొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో వ‌‌రుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ లాక్ డౌన్ తో నిలిచిపోయాయి.  ఈ చిత్రాలు పూర్త‌‌యిన త‌ర్వాతే వెంకీ, వ‌రుణ్ కు టైం దొరుకుతుంది. ఇదిలా ఉంటే మ‌రోవైపు అనిల్ రావిపూడి ఎఫ్ 3 ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇప్ప‌టికే షురూ చేశాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అంతేకాదు జ‌న‌వ‌రి 2021 నుంచి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

కేవ‌లం 5 నెల‌ల్లోనే షూటింగ్ ను కంప్లీట్ చేసి వేస‌వి కానుక‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్న‌ట్టు టాక్‌. వెంకీ, వ‌రుణ్ తేజ్ త‌మ ప్రాజెక్టుల‌ను జ‌న‌వ‌రి క‌ల్లా పూర్తి చేసి, అనిల్‌రావిపూడి తో ప‌ని చేసేందుకు సిద్దంగా ఉంటార‌ని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. మ‌రి అనిల్ రావిపూడి అనుకున్న స‌మ‌యానికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి.. ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాడా..? అన్న‌ది చూడాలి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo