శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 21:33:27

అన‌సూయ ఈ సారైనా పవన్‌తో జోడీ కడుతుందా..?

అన‌సూయ ఈ సారైనా పవన్‌తో జోడీ కడుతుందా..?

బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతుంది అనసూయ భరద్వాజ్. యాంకర్‌గా మొదలై ఇప్పుడు నటిగా సత్తా చూపిస్తుంది. ఇదిలా ఉంటే ఈమెకు వరస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు దర్శక నిర్మాతలు కూడా. మరీ ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్త.. క్షణంలో నెగిటివ్ రోల్ చూసిన తర్వాత అనసూయకు నటిగా ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాలా..? అప్పట్నుంచీ ఇప్పటి వరకు రొటీన్ కథలు కాకుండా కాస్త భిన్నంగా ఉండేలా ఎంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మెగా కుటుంబంలో రామ్ చరణ్‌తో రంగస్థలం.. వరుణ్ తేజ్‌తో ఎఫ్ 2.. సాయి ధరమ్ తేజ్‌తో విన్నర్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు పవన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని వార్తలొస్తున్నాయి. ప‌వ‌న్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. అందులో వకీల్ సాబ్ ఇప్పటికే పూర్తైపోయింది. త్వరలోనే విడుదల కానుంది కూడా. ఈ చిత్రం తర్వాత అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కూడా పూర్తి చేయనున్నాడు.

ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా లైన్ లోనే ఉన్నారు. అయితే క్రిష్ సినిమాలో అనసూయకు ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో అతి ప్రధానమైన ఓ పాటలో అనసూయను నర్తింపచేయాలని ప్రయత్నిస్తున్నాడు క్రిష్. నిజానికి 8 ఏళ్ల కిందే అనసూయ, పవన్ కలిసి నటించాల్సి ఉంది. అత్తారింటికి దారేదిలో ఐటం సాంగ్ చేసే అవకాశం వచ్చినపుడు గుంపులో గోవిందాలా ఉండటం యిష్టం లేక..పైగా గర్భంతో ఉండటంతో ఈ పాటను వదిలేసింది. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఈమెను విమర్శించారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి పవన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మరి ఈ సారి పవన్‌తో జోడీ కడుతుందా..? స్పెషల్ సాంగ్ చేస్తుందా అనేది సస్పెన్స్.

ఇవి కూడా చ‌ద‌వండి..

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!

‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo