ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 16:31:56

సీక్వెల్ కు రూ.12 కోట్లు డిమాండ్ చేశాడా..?

సీక్వెల్ కు రూ.12 కోట్లు డిమాండ్ చేశాడా..?

టాలీవుడ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ చిత్రం ఎఫ్‌2 కు సీక్వెల్ రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఎఫ్ 3 మూవీపై మొద‌టి నుంచి ఏదో ఒక వార్త లైమ్ లైట్ లోకి వ‌స్తూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎఫ్3లో త‌న‌కంటే వెంక‌టేశ్ రోల్ కు ఎక్కువ ప్రాముఖ్య‌త ఉండ‌టంతో.. వ‌రుణ్ తేజ్ ఈ ప్రాజెక్టులో భాగ‌స్వామ్యం కావ‌డం లేద‌ని టాక్ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో అనిల్ రావిపూడి వ‌రుణ్ తేజ్ కోసం మ‌రికొన్ని సీన్లు కూడా యాడ్ చేశాడ‌ట‌.

మ‌రో క్రేజీ గాసిప్ కూడా వినిపిస్తోంది. వ‌రుణ్ తేజ్ ఎఫ్3 కోసం రూ.12 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల‌ని అడుగ‌గా..నిర్మాత దిల్ రాజు ఈ వ‌రుణ్ డిమాండ్ తో డైలామాలో ప‌డిన‌ట్టు టాక్. వ‌రుణ్ తేజ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో  మ‌రి అనిల్ రావిపూడి అనుకున్న స‌మ‌యానికి ఎఫ్3ను సెట్స్‌పైకి తీసుకెళ్దాడా...?లేదా చూడాలి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo