ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 21:21:06

రాజశేఖర్ నుంచి ఆ సినిమాలు చేజారిపోయాయా..?

రాజశేఖర్ నుంచి ఆ సినిమాలు చేజారిపోయాయా..?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో చేయాల్సిన సినిమాలు మరో హీరోకు వెళ్లడం చాలా కామన్. ఒక్కోసారి డేట్స్ కుదరక.. మరోసారి కథలు నచ్చక వదిలేస్తుంటారు. అలా వదిలేసినపుడు ఏం కాదు కానీ వదిలేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్ అయితే మాత్రం కచ్చితంగా బాధగా ఉంటుంది. సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్‌లో అలాంటి అరడజన్ సినిమాలున్నాయి. వాటిని ఆయన వివిధ కారణాలతో చేయలేకపోయాడు. కానీ వేరే హీరోలు చేసిన తర్వాత అవి బ్లాక్‌బస్టర్ విజయం సాధించి సంచలన రికార్డులు సొంతం చేసుకున్నాయి. మరి రాజశేఖర్ నుంచి అలా చేజారిపోయిన సినిమాలు ఏంటో చూద్దాం.. 

1. ఠాగూర్: ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే. తమిళ హిట్ సినిమా రమణను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు రాజశేఖర్. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమా ఆయన నుంచి చేజారి చిరంజీవికి వచ్చింది. ఇక్కడి నుంచే చిరుతో రాజశేఖర్ గొడవలు కూడా మొదలయ్యాయంటారు విశ్లేషకులు.

2. జెంటిల్‌మెన్: వినడానికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ నిజంగానే శంకర్ తన తొలి సినిమా కోసం రాజశేఖర్‌ను అనుకున్నాడు. కానీ డేట్స్ కుదరక అర్జున్‌తో చేసాడు.

3. లక్ష్మీ నరసింహా: సామి రీమేక్ కూడా ముందు రాజశేఖర్ దగ్గరికి వచ్చింది. కానీ ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా బాలయ్య చేతికి వెళ్లింది. 

4. చంటి: కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చంటి ఆఫర్ రాజశేఖర్ దగ్గరికి వచ్చింది. అయితే మరీ సాఫ్ట్ సబ్జెక్ట్ కావడం.. అప్పటికీ ఆయనకు యాక్షన్ ఇమేజ్ ఉండటంతో వదిలేసాడు. అదే వెంకటేష్ కెరీర్‌కు మైలురాయి అయిపోయింది. 

5. నేనేరాజు నేనేమంత్రి: చాలా మందికి తెలియదేమో అప్పట్లో రాజశేఖర్‌తో సినిమా అనౌన్స్ చేసాడు తేజ. అదే నేనేరాజు నేనేమంత్రి. కానీ క్లైమాక్స్ మార్చమని హీరో కోరడంతో తిక్క రేగి హీరోనే మార్చేసాడు తేజ.

6. హనుమాన్ జంక్షన్: మోహన్ బాబు, రాజశేఖర్ హీరోలుగా ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. కానీ డేట్స్ కుదరక అది కాస్తా అర్జున్, జగపతిబాబు చేతుల్లోకి వెళ్లింది. ఇలా ఈ అరడజన్ సినిమాలు కానీ రాజశేఖర్ చేసుంటే ఆయన కెరీర్ నిజంగానే మరో స్థాయిలో ఉండేదేమో..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.