శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 18:50:39

థ‌మ‌న్ ' వ‌కీల్ సాబ్' తో పాడించ‌నున్నాడా..?

థ‌మ‌న్ ' వ‌కీల్ సాబ్' తో పాడించ‌నున్నాడా..?

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లో న‌టుడు మాత్ర‌మే కాకుండా గాయ‌కుడు కూడా ఉన్నాడ‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌మ్ముడు, ఖుషీ, కాట‌మ‌రాయుడు, అత్తారింటికి దారేది, అజ్ఞాత‌వాసి చిత్రాల్లో ప‌వ‌న్ తో స్పెష‌ల్ పాట పాడించారు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు. ప్ర‌తీ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా వ‌కీల్ సాబ్ సినిమాతో ప‌వ‌న్ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న విష‌యం తెలిసిందే. సీరియ‌స్ క‌థాంశంతో సాగే ఈ సినిమాలో కొంత ఫ‌న్ టైం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడంటూ టాలీవుడ్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

అభిమానుల కోరిక మేర‌కు థ‌మ‌న్ వ‌కీల్ సాబ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాట పాడించే ప్ర‌య‌త్నం చేస్తాడ‌ని ప‌లువురు గుస‌గుస‌లాడుకుంటున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన సినిమాల కంటే ఇది భిన్న‌మైంది కావ‌డంతో మ‌రి ఒక‌వేళ ప‌వ‌న్ కోసం పాట పెడితే వ‌ర్క‌వుట్ అవుతుందా..? లేదా? చూడాలి. థమ‌న్ ఇప్ప‌టికే ఎన్టీఆర్, ర‌వితేజ‌, శింబు, ధ‌నుష్ వంటి స్టార్ హీరోల‌తో ఇప్ప‌టికే పాట పాడించిన సంగ‌తి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.