సూర్య సినిమాకు అవమానం..ఆ మూవీకి తక్కువ TRP..!

తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగులో కూడా సూర్యకు చాలా మంది అభిమానులు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆయన సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు. అలాంటి సమయంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా మంచి విజయం అందుకుంది. థియేటర్లలో విడుదల కాకపోయినా అమెజాన్ ప్రైమ్ లో మంచి వ్యూస్ సాధించింది ఈ సినిమా. సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా తెలుగు, తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో సూర్య నటనకు అందరూ ఫిదా అయిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత తాను ఎంత గొప్ప నటుడిని అనే సంగతి ఆకాశం నీ హద్దురా సినిమాతో నిరూపించాడు సూర్య. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడంతో చాలా మంది అప్పుడే ఈ సినిమాని చూశారు.
థియేటర్ లో చూడవలసిన సినిమా అంటూ అభిమానులు ఫీల్ అయ్యారు కూడా. వాళ్లతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా సూర్య సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఆకాశం నీ హద్దురా సినిమా మొన్న సంక్రాంతికి జెమినీ టీవీ స్పెషల్ ప్రీమియర్ వేసింది. పండగ సందర్భంగా సినిమా రావడంతో కచ్చితంగా మంచి రేటింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. పైగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా కావడంతో ఖచ్చితంగా టిఆర్పీ అదిరిపోతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఊహించిన దానిలో కనీసం సగం టీఆర్పీ కూడా రాకపోవడంతో జెమినీ టీవీ నిర్వాహకులు షాక్ అయిపోయారు.
ఆకాశం నీ హద్దురా ఎవరూ ఊహించని రీతిలో కేవలం 6.83 టిఆర్పీ మాత్రమే సాధించింది. దాంతో అభిమానులతో పాటు నిర్వాహకులు కూడా నిరాశ పడ్డారు. ఈ సినిమాకు ఎందుకు ఇంత తక్కువ టిఆర్పి వచ్చింది అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు. సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కావడం.. ఒరిజినల్ ప్రింట్ తొలిరోజు నుంచే అందుబాటులో ఉండటంతో అందరూ అక్కడే సినిమా చూశారు. దాంతో టీవీలో వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. గతంలో సైరా సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైన 40 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఆ తర్వాత టీవీలో వచ్చినప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.
ఇవి కూడా చదవండి..
ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
మహేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!
సమంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్టనుందా..?
చిరంజీవి ఆ రీమేక్ ను పక్కన పెట్టాడా..?
పాయల్ రాజ్పుత్.. ఈ ముద్దుల కహానీ ఏంటి?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి
- నందిగ్రామ్ నుంచి మమత పోటీ..
- గుడ్న్యూస్.. ఇక ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్
- ప్రయాణంతో.. ఒత్తిడి దూరం