శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 18, 2021 , 21:02:21

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు మెల్ల‌మెల్ల‌గా దూర‌మ‌వుతున్నాడు. ఇపుడు సోనూసూద్ ను హీరోగా చూపించ‌డానికి ప‌లువురు ద‌ర్శ‌కనిర్మాత‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ఇటీవ‌లే కాలంలో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ర‌వితేజ న‌టించిన క్రాక్ బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తోంది. ఇపుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు కూడా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే క్రాక్ చిత్రాన్ని చూసిన సోనూసూద్ చాలా ఇంప్రెస్ అయ్యాడ‌ట‌.

క్రాక్ హిందీ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట బీటౌన్ వ‌ర్గాల టాక్‌. మ‌రి రీమేక్ కేవ‌లం నిర్మించ‌డ‌మేనా..? లేదంటే హీరోగా కూడా న‌టిస్తాడా..? అనేది కాలమే నిర్ణ‌యిస్తుంది. గోపీచంద్ మ‌లినేని-ర‌వితేజ కాంబోలో మూడోసారి వ‌చ్చిన క్రాక్ సంక్రాంతి బ‌రిలో నిలిచి..రికార్డులు సృష్టిస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

సురేంద‌ర్ రెడ్డికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌..!


లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo