శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 16:40:47

కోడ్ లో 'ఎస్'‌ అంటే షారుక్ ఖానేనా..?

కోడ్ లో 'ఎస్'‌ అంటే షారుక్ ఖానేనా..?

బాలీవుడ్ డ్ర‌గ్స్ లింక్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్ప‌టివ‌ర‌కు దీపికాప‌దుకొనే, శ్ర‌ద్దాక‌పూర్, సారా అలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ ను విచారించిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌లో దీపికా ముగ్గురు కోస్టార్ల పేర్ల‌ను కోడ్ చేస్తూ.."‌ఏ, ఎస్, ఆర్" అనే కోడ్ నేమ్స్ ను ఎన్సీబీ కి తెలియ‌జేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు ఇప్ప‌టికే హాట్ టాపిక్ గా మారాయి. ఈ కేసులో దీపికా ప‌దుకునే ముగ్గురు హీరోల‌కు స‌మ‌న్లు జారీచేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ ముగ్గురూ గ‌తంలో దీపికా ప‌దుకొనేతో క‌లిసి న‌టించిన‌వారేన‌ని మ‌రో హింట్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. దీంతో ఆ హీరోలెవ‌ర‌నే దానిపై అంద‌రిలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

తాజాగా కోడ్ నేమ్స్ లో ఎస్ అనే ప‌దం ఇపుడు లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఎస్ అంటే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నేనంటూ టాక్ న‌డుస్తోంది. మ‌రోవైపు ఏ అంటే అర్జున్ రాంపాల్ అని కూడా పేరు వినిపిస్తోంది. ఎన్సీబీ అధికారులు వీరిద్ద‌రికీ స‌మ‌న్లు జారీచేస్తారంటూ పుకార్లు తెరపైకి వ‌స్తున్నాయి. దీపికాతో క‌లిసి ఓం శాంతి ఓం, దిల్ వాలే చిత్రాల్లో న‌టించారు అర్జున్ రాంపాల్‌, షారుక్ ఖాన్‌. ఈ రెండు పేర్లు అలా ఉంచితే..మ‌రి ఆర్ అనే కోడ్ ఎవ‌రిదై ఉంటుంద‌ని జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. మొత్తానికి దీపికా చెప్పిన ఏ, ఎస్‌, ఆర్ లు ఎవ‌ర‌నే దానిపై ఎన్సీబీ అధికారుల నుంచి క్లారిటీ వ‌స్తే కానీ తెలియ‌దు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.