మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 18:03:52

వెంకీ కథ‌కు రాంచ‌ర‌ణ్ నో చెప్పాడా..?

వెంకీ కథ‌కు రాంచ‌ర‌ణ్ నో చెప్పాడా..?

ఛలో, భీష్మ చిత్రాల విజయాలతో జోష్ మీదున్న ద‌ర్శ‌కుడు వెంకీకుడుముల‌. ఈ డైరెక్ట‌ర్ రాంచ‌ర‌ణ్ తో సినిమా చేస్తున్నాడ‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే దీనికి సంబంధించిన మ‌రో వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. వెంకీ కుడుముల యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో కూడిన స్టోరీని చ‌ర‌ణ్ వినిపించాడ‌ట‌. అయితే క‌థ విన్న ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో త‌న‌కు ఈ సినిమా సెట్ అవ్వ‌ద‌ని రాంచ‌ర‌ణ్ డైరెక్ట‌ర్ వెంకీకుడుములకు చెప్పాడ‌ట‌. అంతేకాదు న‌ట‌న‌కు ఆస్కార‌మున్న విభిన్న పాత్ర‌ల‌పై దృష్టిపెట్టాల‌ని సూచించిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. 

వెంకీ త‌దుప‌రి చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. మ‌రోవైపు యూవీ క్రియేష‌న్స్ కు చ‌ర‌ణ్ కు మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ప్ర‌స్తుతం రాంచ‌ర‌ణ్ త‌న క‌థ‌కు నో చెప్ప‌డంతో..వెంకీ కొత్త హీరోను సెలెక్ట్ చేస్తాడా..? లేదా రాంచ‌ర‌ణ్ కోసం మ‌రో క‌థ‌ను సిద్దం చేసుకుని వ‌స్తాడా..? అనేది చూడాలి. రాంచ‌ర‌ణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతోపాటు కొర‌టాల శివ‌-చిరంజీవి ప్రాజెక్టులో కీల‌క పాత్ర‌లో క‌నిపింనున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo