అక్కన్నపేట/సిద్దిపేట కమాన్/నంగునూరు/చిన్నకోడూరు/సిద్దిపేట టౌన్/చేర్యాల/కోహెడ/సిద్దిపేట జోన్, మే 10 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు అన్నారు. సోమవారం 24వ వార్డులో ముస్లింల కు రంజాన్ తోఫాలను అందజేశారు.కౌన్సిలర్ నాయ కం లక్ష్మణ్ పాల్గొన్నారు.
నిత్యావసర సరుకులు అందజేత
కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో 12 పేద ముస్లిం కుటుంబాలకు సోమవారం సర్పంచ్ పిల్లి మాధవి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సరుకులను మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖదీర్ సమకూర్చారు. రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయటంపై సర్పంచ్ మాధవి సంతోషం వ్యక్తం చేశారు.
రంజాన్ దుస్తులు పంపిణీ
రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు పంపిణీ చేసిన దుస్తులను సోమవారం చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణి మున్సిపాలిటీ కార్యాలయంలో అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, జుబేదాఎక్బాల్ పాల్గొన్నారు. రంజాన్ కానుకలను సిద్దిపేట 25వ వార్డు ముస్లింలకు కౌన్సిలర్ గుండ్ల యోగి అందజేశారు. మున్సిపల్ అధికారి ప్రవీ ణ్, టీఆర్ఎస్ నాయకులు జనార్దన్, ధర్మ, శ్రీనివాస్, ప్రమోద్ ఉన్నారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో రంజా న్ పండుగ పురస్కరించుకొని ముస్లింలకు ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి దుస్తులను పంపిణీ చేశారు. ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు కాల్వ ఎల్ల య్య, ఉమేశ్‌చంద్ర, బాబు తదితరులు ఉన్నారు. నంగునూరు నాగరాజుపల్లిలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు బియ్యం, బట్టలను అం దజేశారు. సర్పంచ్ పాకాల కల్పన బాబు, ఉప సర్పంచ్ జక్కిరెడ్డి మల్లవ్వ, గ్రామ కార్యదర్శి బండి బాలమణి, ఆశవర్కర్ ఎండీ తాసిన్ ఉన్నారు. ప్రభుత్వం అందించిన దుస్తులను సిద్దిపేట 16వ వార్డు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ ముస్లింలకు అందజేశారు. గౌరవెల్లిలో రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లింలకు నూతన దుస్తులను అక్కన్నపేటమండల వైస్ ఎంపీపీ మజ్జిక మొగిలి అందజేశారు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మజ్జిక మధు నాయకులు ఉన్నారు.