శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 19:25:33

పున‌ర్న‌వికి నిశ్చితార్థం అయిందా..!

పున‌ర్న‌వికి నిశ్చితార్థం అయిందా..!

బిగ్ బాస్ షోతో త‌న ఫాలోవ‌ర్ల‌ను అమాంతం పెంచేసుకుంది టాలీవుడ్ న‌టి పున‌ర్న‌వి భూపాలం. బిగ్ బాస్ సీజన్ 3లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. రాహుల్ సిప్లిగంజ్-పున‌ర్న‌వి రిలేష‌న్ షిప్ పై చాలా వార్త‌లే తెర‌పైకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు, వెబ్ షోస్ తో బిజీగా ఉందీ భామ‌. అయితే త‌న‌కు నిశ్చితార్థం పూర్త‌యింది..త్వ‌ర‌లోనే పెళ్లి అంటూ చెప్ప‌క‌నే చెప్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అంద‌రినీ షాక్ కు గురి చేసింది పున‌ర్న‌వి.

అయితే తన చేయి ప‌ట్టుకుని రింగ్ తొడిగిన ఆ వ్య‌క్తి ఎవ‌రో మాత్రం చెప్ప‌లేదు. వెబ్ షో, సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే పున‌ర్న‌వి ఇలా ఎంగేజ్ మెంట్ అయిన‌ట్టు చెప్పిందా..? లేదంటే నిజంగానే నిశ్చితార్థం పూర్త‌యిందా..? అనే విష‌యంపై స‌స్పెన్స్ నెల‌కొంది. రానున్న రోజుల్లో ఏది నిజ‌మో తెలుస్తోంది. అప్ప‌టివ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. View this post on Instagram

Finally! It's happening ????❤️

A post shared by Punarnavi Bhupalam???? (@punarnavib) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.