గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 18:27:39

ఈ ఇద్ద‌రు నిర్మాత‌ల‌ను ప్ర‌భాస్ సేవ్ చేస్తాడా..?

ఈ ఇద్ద‌రు నిర్మాత‌ల‌ను ప్ర‌భాస్ సేవ్ చేస్తాడా..?

సినీ ప‌రిశ్ర‌మలో ఎంత‌టి టాలెంటెడ్ టెక్నీషియ‌న్స్ అయినా..న‌టులైనా..డ‌బ్బున్న నిర్మాత‌లైనా టైం క‌లిసొచ్చినంత వ‌ర‌కే హ‌వా న‌డుస్తుంది. టైం బాగా లేక‌పోతే ఒక్క సినిమా చాలు నిర్మాత‌ల‌ను తీవ్ర‌న‌ష్టాల్లోకి నెట్టేస్తుంది. అలాంటి కోవ‌లోకి వ‌స్తాయి ప్ర‌భాస్ న‌టించిన రెబ‌ల్‌, గోపీచంద్ న‌టించిన గౌత‌మ్ నందా చిత్రాలు. ఈ రెండు చిత్రాల‌ను జే భ‌గ‌వాన్‌-జే పుల్లారావు నిర్మించారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. నిర్మాత‌లిద్ద‌రికీ తీవ్ర న‌ష్టాల‌నే మిగిల్చాయి. ఎంత‌లా అంటే ప్ర‌భాస్ తో తీసిన రెబ‌ల్ చిత్రం 2012లో విడుద‌లైంది. బాక్సీపీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో ఆ న‌ష్టాల నుంచి గ‌ట్టెక్క‌డానికి నిర్మాత‌లిద్ద‌రికీ ఐదేళ్లు ప‌ట్టింది. ఆ త‌ర్వాత జే భ‌గ‌వాన్‌-జే పుల్లార‌వు గోపీచంద్ తో క‌లిసి గౌత‌మ్ నందా చిత్రాన్ని తీయ‌గా ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. అయితే ఇపుడీ ఇద్ద‌రు నిర్మాత‌ల చూపు ప్ర‌భాస్ పై ప‌డిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ న‌డుస్తోంది.

రెబ‌ల్ సినిమాతో న‌ష్ట‌పోయిన త‌మ‌కు బాహుబ‌లితో స్టార్ డ‌మ్ సంపాదించిన ప్ర‌భాస్ మ‌రో సినిమా చేసే అవ‌కాశ‌మిస్తే ఆ న‌ష్టాన్ని పూడ్చుకోవ‌చ్చ‌ని భావిస్తున్నార‌ట ఈ నిర్మాత‌లు. క‌ష్ట‌కాలంలో ఉన్న నిర్మాత‌ల‌కు అండ‌గా నిలిచే స్టార్ల‌లో మ‌రి ప్ర‌భాస్ కూడా చేర‌తాడా..?లేదా అన్న‌ది చూడాలి. ఒక‌వేళ ప్ర‌భాస్ సినిమా చేసే ఛాన్స్ ఇస్తే ఇద్ద‌రు నిర్మాత‌లు న‌ష్టాల నుంచి కొంతైనా ఉప‌శ‌మ‌నం పొందుతారన‌డంలో ఎలాంటి సందేహం లేదు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo