సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 16:46:45

స‌మంత త‌ర్వాత పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

స‌మంత త‌ర్వాత పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేసిన వాళ్లు మ‌ళ్లీమ‌ళ్లీ చేయాల‌నుకుంటార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. డైరెక్ట‌ర్ గా త్రివిక్ర‌మ్ ‌తో  చేసే జ‌ర్నీతోపాటు ఆయ‌నతో వ్య‌క్తిగ‌తంగా ఫ్రెండ్‌షిప్ కూడా బాగుంటుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతుంటారు. త్రివిక్ర‌మ్ కూడా తాను ప‌నిచేసిన యాక్ట‌ర్ల‌తో మంచి అనుబంధాన్ని కొన‌సాగిస్తుంటాడు. త‌న‌కు న‌చ్చితే ఒకే యాక్ట‌ర్ తో వ‌రుసగా సినిమాలు చేసేందుకు రెడీగా ఉంటాడు. దీనికి అల్లు అర్జున్, ప‌వన్ క‌ల్యాణ్ బెస్ట్ ఉదాహ‌ర‌ణ‌.

ఈ ఇద్ద‌రితో త్రివిక్ర‌మ్ మూడేసి చొప్పున సినిమాలు చేశాడు. ఎన్టీఆర్‌తో ఇప్ప‌టికే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రం చేయ‌గా..రెండో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే హీరోయిన్ల‌కు కూడా ఈ ఫార్ములా అప్లై చేస్తుంటాడు మాట‌ల మాంత్రికుడు. త్రివిక్ర‌మ్‌తో వ‌రుసగా మూడు సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ సమంత‌. పూజా హెగ్డే, ఇలియానా రెండు చొప్పున ఈ డైరెక్ట‌ర్ తో సినిమాలు చేశాడు. ఇపుడు త్రివిక్ర‌మ్ మ‌రోసారి పూజాహెగ్డేనే హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది.

పూజాహెగ్డే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే స‌మంత త‌ర్వాత ఈ స్టార్ డైరెక్ట‌ర్ తో సినిమాలు చేసిన బ్యూటీ పూజాహెగ్డేనే అవుతుంది. మ‌రి పూజాహెగ్డే ఒకే చెప్తుందా..?  లేదంటే త్రివిక్ర‌మ్ బాలీవుడ్ హీరోయిన్లు అన‌న్య‌పాండే, కైరా అద్వానీ లాంటి తార‌ల‌ను తీసుకుంటాడా..? అనేది తెలియాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo