శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 14:21:57

కోవిడ్ టైంలోనూ భారీగా డిమాండ్ చేస్తోన్న పూజాహెగ్డే..!

కోవిడ్ టైంలోనూ భారీగా డిమాండ్ చేస్తోన్న పూజాహెగ్డే..!

2020లో అల వైకుంఠపురం చిత్రంతో  మంచి హిట్ ను ఖాతాలో వేసుకుంది అందాల భామ పూజాహెగ్డే.  ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో టాప్ ప్లేస్‌లో ఉంది పూజాహెగ్డే. ఈ భామ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్..అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా  ఉంటే కోవిడ్ టైంలో రెమ్యునరేషన్ తీసుకునే విషయంలో ఇపుడు కొంత మార్పులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పూజాహెగ్డే మాత్రం దీనికి మినహాయింపు. ఎందుకంటే కోవిడ్ పరిస్తితులతో సంబంధం లేకుండా పూజా హెగ్డే భారీ మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.

పూజాహెగ్డే బాలీవుడ్ ఆఫర్లు వస్తుండటంతో తన దగ్గరకు వచ్చే సినిమాల కోసం భారీగానే డిమాండ్ చేస్తుందట. ఓ తెలుగు సినిమా కోసం ఇటీవలే పూజా రూ.2.5 కోట్లు తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. చిత్రపరిశ్రమ ఇప్పుడిపుడే కోరుకుంటున్న తరుణంలో పూజాహెగ్డే ఇంత మొత్తం తీసుకోవడం ఎక్కువేనని చెప్పాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.