బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 19, 2021 , 15:56:45

‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకున్న పవన్ కళ్యాణ్..?

‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకున్న పవన్ కళ్యాణ్..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్‌ల హవా కనిపిస్తుంది.  వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మన హీరోలు కూడా కథలు దొరకడం లేదన్నట్లు రీమేక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగా హీరోలు అయితే అన్నీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు. అందరూ కాదు కానీ చిరంజీవి, పవన్ ఫోకస్ అంతా ఇప్పుడు రీమేక్ సినిమాలపైనే ఉంది. చిరు ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వేదాళం, లూసీఫర్ రీమేక్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా వరసగా రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్ వకీల్ సాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మలయాళంలో విడుదలైన అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కూడా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ రాస్తున్నాడు. ఇదిలా ఉంటే దాంతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు పవన్ కళ్యాణ్. తాజాగా మరో రీమేక్ కూడా పవన్ ఖాతాలో పడిపోయిందని ప్రచారం జరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. 

దివంగత దర్శకుడు, అయ్యప్పనుమ్ కోషియుమ్ ఫేమ్ సాచి కథ అందించిన ఈ చిత్రం అక్కడ భారీ విజయం సాధించింది. సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగులో వెంకటేష్, రానా హీరోలుగా రీమేక్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్ చరణ్ తీసుకున్నాడు.

తనతోపాటు బాబాయ్ కూడా ఈ సినిమాలో నటించాలనేది రామ్ చరణ్ కోరిక. అందుకే ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ కథపై చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ పోషించిన పాత్రను పవన్‌ చేస్తాడని తెలుస్తుంది. మరో పాత్ర కోసం రామ్ చరణ్ వస్తున్నాడని తెలుస్తుంది. ఒకవేళ అన్నీ కుదిరి ఈ కాంబినేషన్ కానీ వర్కవుట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ తెలుగులో సంచలనం సృష్టించడం ఖాయం.

ఇవి కూడా చ‌ద‌వండి..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo