శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 19, 2020 , 19:46:26

డేటింగ్‌ లో సత్యదీప్‌ మిశ్రా-మసాబా గుప్తా..?

డేటింగ్‌ లో సత్యదీప్‌ మిశ్రా-మసాబా గుప్తా..?

బాలీవుడ్‌ యాక్టర్‌ సత్యదీప్‌ మిశ్రా నటి అదితీరావు హైదరితో 2013లో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నటుడు తాజాగా డేటింగ్‌ లో ఉన్నట్లు ఓ వార్త బాలీవుడ్‌ లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇంతకీ సత్యదీప్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఆ కొత్త వ్యక్తి ఎవరనుకుంటున్నారా..?  ఆమె ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కొన్ని రోజులు దశలవారీగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌ డౌన్‌ సమయంలో సత్యదీప్‌-మసాబా గోవాలో డేటింగ్‌ లో ఉన్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.

రెండు నెలల క్రితం ఈ జంట గోవాలో సరదా సమయాన్ని గడిపేందుకు  వెళ్లగా..లాక్‌ డౌన్‌ తో అక్కడే చిక్కుకుపోయాయని, అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్‌ లో ఉన్నారని ముంబై మిర్రర్‌ తన కథనంలో పేర్కొంది. మసాబా గుప్తా 2015లో దర్శకనిర్మాత మధు మంతెనను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల తర్వాత మధుమంతెనకు విడాకులిచ్చింది. ఇక సత్యదీప్‌ మిశ్రా తన రిలేషన్‌ షిప్‌ గురించి త్వరలోనే ప్రకటించవచ్చని కూడా టాక్‌ వినిపిస్తోంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo