సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 19:58:24

మణిశర్మకు మళ్లీ పూర్వవైభవం వచ్చినట్లేనా?

మణిశర్మకు మళ్లీ పూర్వవైభవం వచ్చినట్లేనా?

హైదరాబాద్‌ : ఒకప్పుడు మణిశర్మ అంటే మెలోడి బ్రహ్మా... ఆయన సంగీతం అందర్ని ఉర్రూతలూగించేది. మణిశర్మ సంగీత దర్శకత్వంలో సినిమా అంటే మ్యూజికల్‌ బ్లాక్‌బస్టరే.... 1990 నుంచి 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన మణిశర్మ ఆ తరువాత కాలంలో కాస్త వెనుకబడ్డాడు. యువతరం సంగీత దర్శకుల పోటీలో మణిశర్మ పనైపోయిందని భావిస్తున్న తరుణంలో రామ్‌, పూరి జగన్నాథ్‌ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్‌శంకర్‌’ చిత్రంతో మణిశర్మ మరోసారి మాస్‌ పాటలతో అందర్ని ఆశ్చర్యచకితులను చేశాడు.

‘ఇస్మార్ట్‌శంకర్‌’ విజయంలో పాటలు కూడా ముఖ్యభూమిక పోషించడంతో మళ్ళీ మణిశర్మకు ఆఫర్ల వెల్లువ ప్రారంభమైంది. ఇప్పుడు మణిశర్మ చేతిలో ఆచార్య, సీటీమార్‌, నారప్ప, ఫైటర్‌, రెడ్‌ తదితర ప్రాజెక్టులు వున్నాయి.  నేడు మణిశర్మ జన్మదినం పురస్కరించుకుని సదరు చిత్ర యూనిట్‌ వర్గాలు జన్మదిన శుభాకాంక్షలుతో పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఇస్మార్ట్‌శంకర్‌ విజయంతో మణిశర్మకు పూర్వవైభవం వచ్చినట్లేనని భావిస్తున్నారు ఆయన అభిమానులు.


logo