లిప్‌లాక్ సీన్ కు లావణ్యత్రిపాఠి ఒకే..?

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఉత్తరాది భామ లావణ్యత్రిపాఠి. ఈ చిత్రం తర్వాత పలు ప్రాజెక్టుల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా సందీప్‌కిషన్ తో కలిసి ఏ1 ఎక్స్ ప్రెస్ లో తళుక్కున మెరిసింది. లావణ్య ఈ సారి యాక్టింగ్ లో తన హద్దులు చెరిపేసుకుని లిప్ టాక్ సన్నివేశాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? అంటూ ఏ1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ ను వీక్షించిన ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పటికే గ్లామరస్ లుక్‌లో కనిపించిన లావణ్య..ట్రైలర్ లో లిప్ లాక్ సీన్ లాంటి సన్నివేశం కనిపిస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ పై లావణ్య త్రిపాఠి నిజంగానే ముద్దు సీన్లలో నటించిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కార్తికేయ హీరోగా నటిస్తోన్న చావు కబురు చల్లగా చిత్రంలో కూడా లావణ్య గ్లామర్ కోటెంట్ను పెంచేసిందని సినీ జనాలు అనుకుంటున్నారు.
ఈ భామ నటించిన ఏ 1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి లావణ్య ఈ సారి తాను చేస్తున్న రోల్స్ కోసం లిమిట్స్ చెరిపేసుకుందా..? లేదా? అనేది తెలియాలంటే సినిమాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి..
తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.