శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 15, 2021 , 13:39:24

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తిసురేశ్‌. ఈ భామ తాజాగా మ‌హేశ్ బాబుతో క‌లిసి స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తోంది. ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. మ‌హానటి కోసం బ‌రువు పెరిగిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత మ‌ళ్లీ సైజ్ జీరో లుక్ లోకి మారిపోయింది. అయితే సైజ్ జీరో లుక్ లో కీర్తిసురేశ్ చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఫీల‌య్యారు ఫ్యాన్స్.

కానీ ఈ సారి స‌ర్కారు వారి పాట కోసం మ‌రో 10 కిలోలు బరువు పెరిగిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. కీర్తిసురేశ్ లైట్ గోల్డెన్ క‌ల‌ర్ శారీ లుక్‌లో చ‌బ్బీ చ‌బ్బీ గా క‌నిపిస్తూ ఫొటోషూట్ లో పాల్గొంది. కీర్తిసురేశ్ ఈ కొత్త లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..? అంటూ తెగ గుస‌గుస‌లాడుకుంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి ఈ స్టిల్స్ కేవ‌లం ఫొటోషూట్ మాత్ర‌మేనా..?  సినిమా కోసమా అన్న‌ది తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చ‌ద‌వండి

స‌ర్కారు వారి పాట కోసం రూటు మార్చిన‌ కీర్తిసురేశ్..!

ఇద్ద‌రు సూప‌ర్ స్టార్ల‌తో షూటింగ్ కు రెడీ


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo