శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 17:09:31

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఇస్మార్ట్ భామ‌..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఇస్మార్ట్ భామ‌..?

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 27వ ప్రాజెక్టుగా వ‌స్తోన్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది. అయితే ప్ర‌స్తుతానికైతే ఈ మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంద‌నే దానిపై క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం వ‌కీల్‌సాబ్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు పవ‌న్. కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తీయనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రో భామ పేరు తెరపైకి వ‌చ్చింది ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.

ఈ బెంగ‌ళూరు భామ ప‌వ‌న్‌-క్రిష్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసే ఛాన్స్ ఉంద‌ని ఫిలింన‌గ‌ర్ లో జోరుగా టాక్ న‌డుస్తోంది. ఒక‌వేళ ప‌వ‌న్ తో సినిమా చేసే అవ‌కాశం కొట్టేసిందంటే నిధిఅగ‌ర్వాల్ ఇమేజ్ మ‌రో స్థాయికి వెళ్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి క్రిష్ అండ్ టీం హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇస్తే గానీ ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక ఇస్మార్ట్ బ్యూటీకి ఈ గోల్డెన్ ఛాన్స్ వ‌స్తుందా..?  లేదా అన్న‌ది చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.