మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 20:08:18

బ్రెడ్ తింటే బరువు పెరుగుతారా?

బ్రెడ్ తింటే బరువు పెరుగుతారా?

బ్రెడ్ అనేది మనకు ఎప్పటినుంచో తెలిసిన ఆహార పదార్థం. మనకు ఎప్పుడైనా బాగా ఆకలేసి తినడానికి ఏమీ లేనప్పుడు వెంటనే బ్రెడ్ వైపు చూస్తుంటాం. సూపర్ మార్కెట్‌లో కూడా ఇది ఈజీగా లభించే ఫుడ్ ఐటమ్. ఇది ఆరోగ్యానికి మంచిదని చాలా మంది వైద్యులు చెబుతుంటారు. కానీ ఈ మధ్య చాలా మందికి వస్తున్న మరో అనుమానం ఏంటంటే.. బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఫ్యాట్ పెరుగుతుందా ..?  బరువు పెరుగుతారా అని. .? ఈ ప్రశ్నకు కొందరు..  ఇండస్ట్రియల్ బ్రెడ్‌లో సంరక్షణకారులు(preservatives), సంకలనాలు(additives),ఉప్పు ఉంటాయని అంటే. మరికొందరు ఇది హైల్తీ డైట్‌లో భాగమే అని అంటున్నారు.

అంతేకాదు.. బ్రెడ్ తినడం వల్ల నడుము భాగంలో కొవ్వు పెరుగడంతో పాటు ఇతర ఆరోగ్య సమ్యలు కూడా రావచ్చని కొంతమంది అంటుండగా.. మంచి క్వాలిటీ బ్రెడ్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియన్ట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఉంటాయని మరికొందరి వాదన. అయితే రెండు రకాల వాదనలు నిజమేనని కొన్ని స్టడీలు చెబుతున్నాయి. ఎందుకంటే బ్రెడ్‌లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి మంచి చేకూర్చేవయితే.. మరికొన్ని కొంచెం ఫ్యాట్ కలిగించేవి. వీటిలో ముఖ్యమైనవి రెండు రకాలు

1.Whole wheat bread(brown bread)

2.White bread

నిజానికి వైట్ బ్రెడ్ కన్నా.. హోల్ వీట్ బ్రెడ్ తినడం చాలా మంచిదని. ఎందుకంటే దీంట్లో అధిక మొత్తంలో ఫైబర్, ప్రొటీన్లు కలిగి ఉంటాయట. ఇవి  మన శరీరంలోకి చెక్కర శాతాన్ని ఎక్కువ పోనివ్వకుండా  అడ్డుకుంటాయి. ఫలితంగా బాడీలో షుగర్ లెవల్స్ మారకుండా ఉంటాయి.

*Whole wheat bread

రెండు వీట్ బ్రెడ్ స్లైసెస్‌లో దాదాపు 30గ్రాముల కార్బోహైడ్రెట్స్, 4గ్రాముల ఫైబర్‌‌లతో పాటు.. పలు విటమిన్లు, మినరల్స్ ఉంటాయట. అన్నిబ్రెడ్‌లలో కార్బోహైడ్రెట్స్ ఉన్నప్పటికీ వీటిలోని కార్బ్స్ కొంచెం నెమ్మదిగా అరుగుదాయట.  

*White bread

వైట్ బ్రెడ్‌లో.. పిండి, సంకలనాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. రిఫైనిడ్ ఫ్లోర్‌లో హెల్తీ ఫ్యాట్స్, క్వాలిటీ ప్రొటీన్లు ఉండవు. వైట్ బ్రెడ్ చాలా మృదువుగా, రుచిగా ఉన్నప్పటికీ.. ఇవి తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. వైట్ బ్రెడ్ తిన్నప్పుడు సరైన డైట్ పాటించడం కానీ.. రెగ్యులర్ ఎక్సర్ సైజ్ చేయడం కానీ తప్పక చేయాలి. లేదంటే క్యాలరీలను పెంచుతుంది. 

ఓ రకంగా చూస్తే బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ రెండింటిలోనూ సమానమైన క్యాలరీలు ఉంటాయి. కానీ బ్రౌన్ బ్రెడ్‌లోని  కార్బోహైడ్రేట్స్ బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. వీటిలోని మేంగ‌నీస్, సెలినియమ్, ఫైబర్, విటమిన్లు మన కడుపు నిండా తిన్నట్లు చేయడమే కాకా.. మంచి అరుగుదలకు సహకరించి బరువు పెరగకుండా ఆపుతుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.