శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 15:49:57

అడ్వాన్స్ తీసుకునేందుకు దీపికా నో చెప్పిందా..!

అడ్వాన్స్ తీసుకునేందుకు దీపికా నో చెప్పిందా..!

ఇండియాలోని స్టార్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది దీపికాప‌దుకొనే. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌, క‌థాబ‌ల‌మున్న చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ కోట్లలో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. తాజా‌గా ప్ర‌భాస్ 21వ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే చిత్ర‌నిర్మాత అశ్వ‌నీద‌త్ ఈ సినిమా కోసం దీపికా అడ్వాన్స్ ఇస్తాన‌ని చెప్ప‌గా..దీపిక మాత్రం అడ్వాన్స్ చెక్ తీసుకునేందుకు నో చెప్పింద‌ని టాక్ న‌డుస్తోంది.

సినిమా సెట్స్ పైకి వెళ్లిన‌పుడు మాత్ర‌మే అడ్వాన్స్ తీసుకుంటాన‌ని చెప్పిన‌ట్టు ఇన్‌సైడ్ టాక్‌. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి నిర్మాత‌ల‌కు గ‌డ్డ ప‌రిస్తితులు నెల‌కొన్న నేప‌థ్యంలో మ‌ళ్లీ షూటింగ్స్ ఎప్పుడు షురూ అవుతాయా అనే డైలామా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగానే ద‌త్ ఫ్యామిలీ నుంచి అడ్వాన్స్ తీసుకునేందుకు దీపికా నో చెప్పిన‌ట్టు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే వీటిలో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముందనే విష‌యంపై దీపిక ఏమైనా స్పందిస్తుందో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo