గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 14:34:50

భ‌ర్త‌తో విడిపోనున్న పూన‌మ్ పాండే..?

భ‌ర్త‌తో విడిపోనున్న పూన‌మ్ పాండే..?

బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే త‌న భ‌ర్త సామ్ బాంబేపై వేధింపుల కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. హ‌నీమూన్ స‌మ‌యంలో త‌నను దూషించ‌డంతోపాటు వేధించాడ‌ని పూన‌మ్ పాండే ఫిర్యాదు చేయ‌డంతో గోవా పోలీసులు సామ్ బాంబేను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. అయితే ఆ త‌ర్వాత సామ్ బాంబే బెయిల్ పై విడుద‌ల‌య్యాడు. అయితే త‌న భ‌ర్త సామ్ బాంబే వేధింపుల‌కు పాల్ప‌డుతున్నా..ప‌రిస్థితులు మారుతాన‌ని తాను ఎదురుచూశాన‌ని, సామ్ ను ఎంతో ప్రేమించ‌డంతో తాను ఓపిక‌గా ఉన్నాన‌ని చెప్పింది పూన‌మ్‌.

అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితులు విష‌మించ‌డంతో సామ్ బాంబేతో వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పాల‌ని భావిస్తున్న‌ట్టు బీటౌన్ వ‌ర్గాల టాక్‌. గ‌త కొన్నాళ్లుగా రిలేష‌న్ షిప్ లో ఉన్న పూన‌మ్‌-సామ్ ఇటీవ‌లే అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈ క‌పుల్ కాంప్ర‌మైజ్ అయి క‌లిసుంటారా..? విడిపోతారా..? అన్న‌ది చూడాలి. తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో న‌టించిన పూన‌మ్ పాండే 2018లో వ‌చ్చిన ది జ‌ర్నీ ఆఫ్ క‌ర్మ చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌రే సినిమాలో న‌టించ‌లేదు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.