బిగ్ బాస్ ఈ సారి కూడా అమ్మాయిలకు హ్యాండిచ్చినట్లేనా..?

అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుంటారు.. అబ్బాయిలతో సమానం అంటారు. కానీ అదేం విచిత్రమో కానీ బిగ్ బాస్ విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. మిగిలిన భాషల్లో అమ్మాయిలు, అబ్బాయిలు సమానంగానే ఉన్నారు. కానీ తెలుగులో మాత్రం ఇప్పటి వరకు అది జరగలేదు. అదేంటి బిగ్ బాస్ లోకి బాగానే అమ్మాయిలు వస్తున్నారు.. సత్తా చూపిస్తున్నారు కదా అనుకుంటున్నారా..? అవును చూపిస్తున్నారు కానీ విన్నర్ మాత్రం కావడం లేదు. ఇప్పటి వరకు తెలుగులో మూడు సీజన్స్ అయితే అంతా అబ్బాయిలే టైటిల్స్ గెలిచారు. ఒక్కసారి కూడా అమ్మాయిలకు బిగ్ బాస్ టైటిల్ అయితే అందలేదు.
కనీసం నాలుగో సీజన్ అయితే అమ్మాయిలు గెలుస్తారేమో అనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ సారి కూడా అబ్బాయిలే టైటిల్ ఎగరేసుకుపోయేలా కనిపిస్తున్నారు. తొలి సీజన్ శివ బాలాజీ.. రెండో సీజన్ కౌశల్.. మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్స్ గా నిలిచారు. ప్రతీసారి రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంటున్నారు అమ్మాయిలు. బిగ్ బాస్ 4 తెలుగులో ప్రస్తుతం అభిజీత్ దూసుకుపోతున్నాడు. ఈయనకున్న ఫాలోయింగ్ చూస్తుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఈయనకు ఓట్ల ఫాలోయింగ్ కూడా మరో స్థాయిలో ఉంది. ఆయన తర్వాత సోహైల్, అఖిల్ దూసుకుపోతున్నారు. అరియానా కూడా రప్ఫాడిస్తుంది కానీ విన్నర్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మొదట్లో బాగానే ఆడినా ఈ మధ్య కాలంలో అవినాష్ మాయలో పడి ఆయన కోసమే గేమ్ ఆడుతుందనే విమర్శలు మూటగట్టుకుంది. మరోవైపు హారిక కేరాఫ్ అభిజీత్ అయిపోయింది. మోనాల్ తెలుగమ్మాయి కాదు కాబట్టి గెలిచే అవకాశాలు తక్కువ. అవినాష్ వైల్డ్ కార్డ్ కాబట్టి విన్నర్ ఇవ్వరు. సో.. ఈ సారి కూడా ఎలా చూసుకున్నా అబ్బాయికే టైటిల్ వచ్చేలా కనిపిస్తుంది. ఇదే కానీ జరిగితే అమ్మాయిలకు ప్రతీసారి బిగ్ బాస్ సరిపోదేమో అనే చర్చ కూడా బయట జరుగుతుందిక. చూడాలిక ఏం జరుగుతుందో..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వెనక్కి తగ్గిన వాట్సాప్.. ప్రైవసీ పాలసీ అమలు వాయిదా
- ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని
- స్పుత్నిక్-వీ మూడో విడత ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి
- అడవి అందాలను ఆస్వాదిద్దాం!
- ఈ రోజు మీ రాశిఫలాలు
- గ్రేటర్ ఓటర్లు.. 87.65 లక్షలు
- ఆ సీక్రెట్ ప్లేస్‌ను.. పసిగట్టలేకపోయారు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు