ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 19:32:34

‘అల్లుడు అదుర్స్’ కలెక్షన్స్..బెల్లంకొండ టార్గెట్ రీచ్ అయ్యాడా..?

‘అల్లుడు అదుర్స్’ కలెక్షన్స్..బెల్లంకొండ టార్గెట్ రీచ్ అయ్యాడా..?

రాక్షసుడు లాంటి హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమా అల్లుడు అదుర్స్. తన తొలి సినిమా అల్లుడు శీను బాగానే ఆడింది కదా అని అదే సెంటిమెంట్ తో మరోసారి అల్లుడుగా వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. పైగా సంక్రాంతి పండక్కి వచ్చేయడంతో అంతా ఈయన కాన్ఫిడెన్స్ లెవల్స్ చూసి ఔరా అనుకున్నారు. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే సినిమా వచ్చి 5 రోజులు అయిపోయింది. దానికి తోడు క్రాక్, మాస్టర్, రెడ్ లాంటి సినిమాలతో పోటీ పడటంతో రేసులో కాస్త వెనకబడిపోయాడు బెల్లంకొండ. మరి ఈ సినిమాకు 5 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు చూద్దాం.. 

నైజాం: 2.02 కోట్లు

సీడెడ్: 1.31 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.28 కోట్లు

ఈస్ట్: 44 లక్షలు

వెస్ట్: 44 లక్షలు

కృష్ణా: 25 లక్షలు

గుంటూరు: 46 లక్షలు

నెల్లూరు: 21 లక్షలు

ఏపీ+తెలంగాణ 5 రోజుల వసూళ్లు.. 6.41 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 12 లక్షలు

ఓవర్సీస్: 5 లక్షలు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 6.58 కోట్లు

'అల్లుడు అదుర్స్' సినిమా ఇప్పటి వరకు 6 కోట్లు షేర్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా దాదాపు 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ అల్లుడు అదుర్స్ సినిమాను చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నాడు నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం. దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల వరకూ షేర్ రావాలి. అంటే ఇంకా దాదాపు 4 కోట్లు వెనకబడి ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

ఇవి కూడా చ‌ద‌వండి..

RRR క్లైమాక్స్ మొద‌లైంది..రాజ‌మౌళి ట్వీట్ వైర‌ల్‌

ర‌కుల్ జిమ్ వ‌ర్క‌వుట్ వీడియో వైర‌ల్

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo