బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 14:32:28

'గోన‌గ‌న్నారెడ్డి'‌ గా బాల‌కృష్ణ‌..?

'గోన‌గ‌న్నారెడ్డి'‌ గా బాల‌కృష్ణ‌..?

టాలీవుడ్ యాక్ట‌ర్ నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం బీబీ3 సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. లాక్ డౌన్ ప్ర‌భావంతో నిలిచిపోయిన షూటింగ్ త్వ‌ర‌లోనే షురూ కానుంది. ఇదిలా ఉంటే మ‌రో క్రేజీ అప్ డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

తెలంగాణ ఐకానిక్ హీరోగా పేరుగాంచిన గోనగ‌న్నారెడ్డిపై సినిమా చేసేందుకు బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నాడ‌ని, బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తాడ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కేది నిజ‌మేనా..? కాదా..? అనేది తెలియాలంటే అటు బాల‌య్య‌, బోయ‌పాటి నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన‌ రుద్ర‌మ‌దేవి చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.