శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 09:07:09

ఇర్ఫాన్ యుద్ధంలో పోరాడుతున్నారు: అధికార ప్ర‌తినిధి

ఇర్ఫాన్ యుద్ధంలో పోరాడుతున్నారు: అధికార ప్ర‌తినిధి

53 ఏళ్ల బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్  2018 లో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడ్డ సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల పాటు ఆయ‌న‌కి లండ‌న్‌లో చికిత్స అందించగా ఇటీవ‌ల ఇండియాకి వ‌చ్చారు. అయితే మంగ‌ళవారం ఇర్ఫాన్‌ని ఆక‌స్మాత్తుగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో ఇర్ఫాన్ ఆరోగ్యంకి సంబంధించి అనేక పుకార్లు హ‌ల్ చేశాయి. ఇర్ఫాన్ ఆరోగ్యం క్షీణించింద‌ని కొంద‌రు, విష‌మంగా ఉందని మ‌రికొంద‌రు, ఇంకొంద‌రు అయితే ఏకంగా చ‌నిపోయాడిన పుకార్లు ప‌ట్టించారు.

ఈ నేప‌థ్యంలో ఇర్ఫాన్ అధికార ప్ర‌తినిధి సోష‌ల్ మీడియాలో వార్త‌ల‌ని ఖండిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇర్ఫాన్ ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన విష‌యం వాస్త‌వ‌మే. పేద్ద‌ప్రేగుకి వ‌చ్చిన ఇన్‌ఫెక్షన్ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. అత‌ను బ‌ల‌మైన వ్యక్తి, ఇప్ప‌టికీ యుద్ధంలో పోరాడుతున్నారు. ప్ర‌స్తుతం డాక్టర్ అబ్జ‌ర్వేష‌న్‌లో ఉన్నారు. ఆయ‌న సంక‌ల్ప బ‌లం, శ్రేయోభిలాషుల ప్రార్ధ‌న‌ల‌తో ఆయ‌న ఆరోగ్యం న‌య‌మ‌వుతుంద‌ని మేము విశ్వ‌సిస్తున్నాము. ఈ లోపే లేని పోని రూమ‌ర్స్‌తో ప్ర‌జ‌ల‌లో ఆందోళ‌న‌లు, భ‌యానకం క‌లిగించొద్దు అని ఇర్ఫాన్ అధికార ప్ర‌తినిధి పేర్కొన్నారు.  


logo