ఆదివారం 31 మే 2020
Cinema - May 05, 2020 , 17:57:10

స్విమ్మింగ్ పూల్‌లో ఇర్ఫాన్ ఖాన్‌..వీడియో చ‌క్క‌ర్లు

స్విమ్మింగ్ పూల్‌లో ఇర్ఫాన్ ఖాన్‌..వీడియో చ‌క్క‌ర్లు

బాలీవుడ్ న‌టుడు  ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇర్ఫాన్ ఖాన్ మృతి అభిమానులంద‌రినీ శోక‌సంద్రంలో ముంచేసింది. తాజాగా ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ త‌న తండ్రి త్రోబ్యాక్ వీడియో ఒక‌టి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇర్ఫాన్ ముంబైలోని ఓ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా..ప‌క్క‌నే ఓ మ‌హిళ వీడియో తీస్తూ ..ఇది మంచు అంటోంది.

ఇర్ఫాన్ ఖాన్ కు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఫిలిం సిటీలో డిస్క‌వ‌రీ ఆఫ్ ఇండియా షూటింగ్ లో ఉన్న‌పుడు  ఇర్ఫాన్ ఓ చిన్న కొల‌నులోకి దూకాడు. అపుడు నేను బ‌య‌ట కూర్చొని ఇర్ఫాన్ తో మాట్లాడుతున్నాన‌ని ఈ వీడియోకు న‌టుడు విపిన్ శ‌ర్మ కామెంట్ పోస్ట్ చేశాడు.

 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo