మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 12:27:36

చావు క‌బురు చ‌ల్ల‌గా నుండి లావ‌ణ్య త్రిపాఠి లుక్ విడుద‌ల‌

చావు క‌బురు చ‌ల్ల‌గా నుండి లావ‌ణ్య త్రిపాఠి లుక్ విడుద‌ల‌

హ్యాపెనింగ్ ఎన‌ర్జిటిక్ హీరో కార్తికేయ‌, ల‌క్కీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ళ‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రుస విజ‌యాల‌తో కేరాఫ్ స‌క్స‌స్ బ్రాండ్ ని సొంతం చేసుకున్న యంగ్‌ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ‌స్తీ బాలరాజు పాత్ర‌లో కార్తికేయ న‌టిస్తుండ‌గా ఆయ‌న‌కు సంబంధించిన లుక్ ఇప్ప‌టికే విడుద‌లైంది. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా మ‌ల్లిక అనే పాత్ర పోషిస్తున్న లావ‌ణ్య త్రిపాఠి లుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఇందులో లావ‌ణ్య శిలువ లాకెట్‌ను మెడ‌లో వేసుకొని చాలా సింపుల్‌గా క‌నిపిస్తుంది. లావ‌ణ్య లుక్‌కి మంచి స్పంద‌న ల‌భిస్తుంది.