సోమవారం 25 మే 2020
Cinema - Feb 21, 2020 , 13:20:34

మోస‌గాళ్ళు చిత్రం నుండి కాజ‌ల్ లుక్ వ‌చ్చేసింది

మోస‌గాళ్ళు చిత్రం నుండి కాజ‌ల్ లుక్ వ‌చ్చేసింది

విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జెఫ్రీ గీచిన్ తెర‌కెక్కిస్తున్న చిత్రం మోస‌గాళ్ళు. సునీల్ శెట్టి, న‌వ‌దీప్, న‌వీన్ చంద్ర‌, రూహి సింగ్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా చిత్రంలో కాజ‌ల్ పాత్ర‌కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తెల్ల‌ని దుస్తుల‌లో కాజ‌ల్ అతిలోక సుంద‌రిలా క‌నిపిస్తుంది. ప్ర‌పంచ ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొంద‌నుండ‌గా,  ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ నేతృత్వంలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రిస్తున్నారు. వేస‌విలో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి మంచు విష్ణు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 


logo