టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో బాక్సింగ్ చాంపియన్ గా కనిపించబోతున్నాడు. అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఫస్ట్ హాఫ్ లో విజయ్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్ గా కనిపించనుండగా..సెకండాఫ్ లో ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడట.
ఈ రోల్ కోసం విజయ్ ఫిజికల్ ఫిట్నెస్ తోపాటు థాయ్‌లాండ్‌లో ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ లవర్ గా అనన్యపాండే నటిస్తోంది. కరణ్ జోహార్, ఛార్మీకౌర్, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది లైగర్.
ఇవి కూడా చదవండి..
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ