ఆదివారం 24 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 17:11:33

విద్యార్థి నాయ‌కుడిగా అల్లు అర్జున్..?

విద్యార్థి నాయ‌కుడిగా అల్లు అర్జున్..?

టాలీవుడ్ లో కొర‌టాల శివ‌-అల్లు అర్జున్ డైరెక్ష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. తొలిసారిగా వ‌స్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుత్ం బ‌న్నీ పుష్ప సినిమాతో, చిరంజీవి ఆచార్య షూటింగ్ తో కొర‌టాల బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌వ‌గానే బ‌న్నీ-కొర‌టాల చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఫిలింన‌గర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఈ మూవీ సాగ‌నున్నట్టు లేటెస్ట్ టాక్‌. అంతేకాదు ఈ చిత్రంలో సెకండాఫ్ లో అల్లు అర్జున్ విద్యార్థి నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట. మ‌రి ఇది నిజ‌మేనా..?  కాదా ? అనేది తెలియాలంటే 2022లో సినిమా విడుద‌లయే వ‌ర‌కు ఆగాల్సిందే.

గీతాఆర్ట్స్ 2-కొర‌టాల స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హై బ‌డ్జెట్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ మూవీ గురించి మ‌రిన్ని విష‌యాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo