పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)సినిమాల విషయంలో సూపర్ ఫాస్ట్ ట్రైన్ లా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ ను పూర్తి చేసిన ప్రభాస్..ప్రశాంత్ నీల్ తో సలార్ (Salaar) సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమాకు కూడా లైన్ లో పెట్టాడు. కాగా ప్రభాస్ కు సంబంధించిన మరో క్రేజీ వార్త ఇండస్ట్రీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
(Bollywood )బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) తో సినిమా చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ ఓరియెంట్ కథాంశాన్ని సిద్దార్థ్ ఆనంద్ ఇటీవలే ప్రభాస్ కు వినిపించగా..అది ప్రభాస్ కు బాగా నచ్చిందట. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ప్రభాస్-సిద్దార్థ్ ఆనంద్ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని బీటౌన్ వర్గాల సమాచారం.
ప్రభాస్ ప్రస్తుతమున్న సినిమాలను పూర్తి చేయగానే సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో అంజానా అంజానీ, బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి భారీ ప్రాజెక్టులను తెరకెక్కించాడు. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో పఠాన్ సినిమా చేస్తున్నాడు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ