నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కడప పరిసర ప్రాంతాల్లో అఖండ సినిమా షూటింగ్ జరుగుతుంది. మిర్యాల రవీందర్ రెడ్డి దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్‌పై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా బోయపాటి సినిమాల్లో క్లైమాక్స్ చాలా భారీగా ఉంటుంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. తొలి సినిమా భద్ర నుంచి మొన్నటి వినయ విధేయ రామ వరకు అన్ని సినిమాల్లో కూడా క్లైమాక్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటం కామన్ అయిపోయింది. ఇప్పుడు అఖండ సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలకు కొదవ లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం యాక్సన్ సన్నివేశాలే ఉంటాయని.. ఈ సినిమా నుంచి తప్పుకున్న ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ తెలిపారు. అన్ని రోజులు డేట్స్ కేటాయించలేక అఖండ నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు అంతకుమించి ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయి. అన్నింటిని మించి టీజర్లో చూపించిన అఘోర పాత్ర ఎక్కువ సమయం ఉండదని తెలుస్తోంది. ఇంటర్వెల్ సమయానికి వచ్చి సెకండ్ హాఫ్‌లో కాసేపు ఉండి.. మళ్లీ క్లైమాక్స్‌లో ఆ పాత్ర వస్తుందని ప్రచారం జరుగుతుంది. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్‌లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్