శనివారం 16 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 13:00:29

రాఘ‌వేంద్ర‌రావు పాత్ర ఏంటో తెలుసా..?

రాఘ‌వేంద్ర‌రావు పాత్ర ఏంటో తెలుసా..?

అంద‌రూ ద‌ర్శ‌కేంద్రుడిగా పిలుచుకునే టాలీవుడ్ డైరెక్ట‌ర్ కే రాఘ‌వేంద్ర‌రావు 78 ఏండ్ల వ‌య‌స్సులో తన‌లోని న‌టుడిని ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేసేందుకు రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. రాఘ‌వేంద్ర‌రావును న‌టుడు, ర‌చయిత త‌ణికెళ్ల‌భ‌ర‌ణి యాక్ట‌ర్ గా ప‌రిచయం చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇపుడు ఫిలింన‌గర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు రిటైర్ ఉద్యోగిగా క‌నిపించ‌నున్నార‌ట‌. అంతేకాదు ర‌మ్య‌కృష్ణ ఆయ‌న స‌తీమ‌ణి క‌నిపించ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

త‌నికెళ్ల‌భ‌ర‌ణి ఇప్ప‌టికే బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ల‌క్ష్మి కాంబినేష‌న్ లో తెర‌కెక్కించిన మిథునం సినిమా బాక్సాపీస్ వ‌ద్ద విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే ఈ సారి మాత్రం ర‌చ‌యిత‌గా, డైరెక్ష‌ర్ గా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో సినిమాను తీసేలా ప్లాన్ చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.