శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 24, 2020 , 15:02:56

నాని కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్‌..!

నాని కొత్త చిత్రానికి ఆసక్తికర టైటిల్‌..!


టాలీవుడ్‌ యాక్టర్‌ నాని బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిబీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వి’. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. దీంతోపాటు శివనిర్వాణ దర్శకత్వంలో టక్‌ జగదీశ్‌ అనే చిత్రాన్ని కూడా ఇప్పటికే లైన్‌లో పెట్టాడు నాని. మరోవైపు టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి ఓ చిత్రానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఇవాళ నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారని టాక్‌ వినిపిస్తోంది.

ఈ మూవీకి  ‘శ్యాం సింఘ రాయ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నాని కొత్త సినిమా టైటిల్‌ ఇదే ఉంటుందా..? లేదా మారుతుందా..? అనేది తెలియాలంటే మరికొంత సమయం వెయిట్‌ చేయాల్సిందే. నాని ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే నిర్మాణ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్‌ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


logo