బుధవారం 27 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 19:22:04

బాలయ్య సినిమాకు ఆసక్తికరమైన టైటిల్..

బాలయ్య సినిమాకు ఆసక్తికరమైన టైటిల్..

హైదరాబాద్‌ : బాలయ్య సినిమా చేస్తున్నాడంటే ఆ కథ ఎలా ఉండబోతుంది అని కాదు.. ముందు ఈ సినిమా టైటిల్ ఏంటి అని ఆలోచిస్తుంటారు ఆయన అభిమానులు. ఎందుకంటే నందమూరి బాలయ్య సినిమా అంటే టైటిల్‌పై అంత ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు కూడా ఈయన చేస్తున్న బోయపాటి సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనేది చాలారోజుల నుంచి వేచి చూస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పటి వరకు చెప్పలేదు శ్రీను. ప్రస్తుతానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే మోనార్క్ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు బాలయ్య. 

అందులో ఒకటి కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తుండగా.. బాలయ్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అప్పట్లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊకొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో అతిథి పాత్ర చేసిన తర్వాత.. 8 ఏళ్లు గ్యాప్ తీసుకుని మరోసారి కుర్ర హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు బాలకృష్ణ. ఈ సినిమాకు బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఆయన కోసమే నాగశౌర్య లాంటి కుర్ర హీరో సినిమాలో అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు బాలకృష్ణ. 

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోయే ఈ సినిమాకు బలరామయ్య బరిలోకి దిగితే.. అనే పవర్ ఫుల్ టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నాడు బాలయ్య. సంతోశ్‌ శ్రీనివాస్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా ఉండబోతుంది. పవర్ ఫుల్ స్టోరీతోనే బలరామయ్య బరిలోకి దిగుతున్నాడని తెలుస్తుంది. మరి ఈయన దిగితే ఏం జరుగుతుందో చూడాలి మరి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo