బిగ్ బాస్ సీజన్ ఈ వారం హౌజ్‌కి కెప్టెన్‌గా ఉండేందుకు రెడ్, బ్లూ టీమ్‌లోని ప్రియాంక సింగ్, యానీ మాస్టర్, ప్రియ, మానస్, సన్నీ, విశ్వలకు ఇసుకతో ఆట ఈజీ కాదు బేటా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో పోటాపోటీగా ఆడి అందరికంటే ఎక్కువగా విశ్వ ఎక్కువ ఇసుకను సంపాదించడంతో ఆరోవారంలో విశ్వ హౌస్ కెప్టెన్ అయ్యాడు. దీంతో విశ్వ రెండోసారి బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు.
పాపం ఈ సారైన కెప్టెన్ బ్యాండ్ ధరిస్తాడేమోనని అందరు ఎదురు చూశారు. నిరాశే దక్కింది. ఇక రేషన్ మేనేజర్ ఎంపిక కోసం మానస్, సన్నీ , ప్రియాంక పోటీ పడ్డారు. మీ ముగ్గురిలో ఎవరు రేషన్ మేనేజర్‌గా ఉండాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండని ఫన్నీ టాస్క్ ఇచ్చారు. అనంతరం టాస్క్‌లో పింకీ విజేతగా నిలిచింది.
ఇక అర్ధరాత్రి దుప్పటి కప్పుకొని పడుకున్న మానస్‌కు నుదుటున బొట్టు పెట్టింది పింకీ. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. పింకీ మనసులోని భావాలని పాట రూపంలో బయట పెట్టడంతో ఆమె తెగ సిగ్గుపడింది. నీకు మానస్ అన్నయ్య అవుతాడని చెప్పగా సిరి మాత్రం.. కానే కాదని, తను నా ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. మొత్తానికి చాలా ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఈ రోజు మరింత ఆసక్తికరంగా సాగనుంది.